Aadi: ‘ఆది’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏంటో తెలుసా?

‘నిన్ను చూడాలని’ (Ninnu Choodalani) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్(Jr NTR).. మొదటి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. అయితే ఆ తర్వాత రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో, కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ 1’  (Student No: 1) సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అంతా కీరవాణి (M. M. Keeravani), రాఘవేంద్రరావు..లకే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ (Subbu) సినిమా పెద్దగా ఆడలేదు. అయితే 2002లో వి.వి.వినాయక్  (V. V. Vinayak)  అనే దర్శకుడితో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ట్రేడ్లో అంచనాలు పెద్దగా లేవు.

Aadi

కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ‘ఆది’  (Aadi) సినిమా మార్చి 28న రిలీజ్ అయ్యింది. బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh)  ఈ సినిమాకి నిర్మాత. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రతి షోకి స్క్రీన్స్ పెరిగాయి. మొదటి రోజుకి రెండో రోజుకి ‘ఆది’ సినిమాకి చాలా థియేటర్లు పెరిగాయి. అలాగే కలెక్షన్స్ కూడా పెరిగాయి. ఫైనల్ గా ‘ఆది’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఎన్టీఆర్,వి.వి.వినాయక్..లు స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే ‘ఆది’ సినిమా పక్కన కొన్ని క్రేజీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ‘ఆది’ రిలీజ్ రోజు నాడే ‘నీతోడు కావాలి’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ‘సుస్వాగతం’ ‘సూర్యవంశం’ వంటి హిట్లు ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావు దీనికి దర్శకుడు. ప్రమోషన్స్ బాగానే చేశారు.

కానీ ఈ సినిమా ఆది ముందు నిలబడలేకపోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన శ్రీకాంత్ ‘ఆడుతూ పాడుతూ’ , వెంకటేష్ (Venkatesh) ‘వాసు’ (Vasu) సినిమాలు కూడా ‘ఆది’ దూకుడు ముందు నిలబడలేకపోయాయి. అంతేకాదు ‘ప్రియదర్శిని’ ‘బెజవాడ పోలీస్ స్టేషన్’ ‘ఫ్రెండ్స్’ ‘నరహరి’ ‘మనసుంటే చాలు’ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఒక్క ‘మౌనమేలనోయి’ సినిమా యావరేజ్ గా ఆడింది.

‘ఎల్ 2 – ఎంపురాన్’ కలెక్షన్స్.. అక్కడ బీభత్సం కానీ ఇక్కడ..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus