గతేడాది నెగిటివ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించిన సినిమాలు..!

  • January 5, 2023 / 08:29 PM IST

2022 లో తెలుగు సినిమాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది జనాలు థియేటర్లకు వచ్చే పద్ధతి పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ సినిమాలకు జనాలకు వెళ్లడం లేదు, కంటెంట్ ఉండాలి అంటూ చాలామంది కామెంట్లు చేశారు.కానీ వాస్తవానికి ఏ సినిమా అయితే ప్రమోషనల్ కంటెంట్ తో జనాలను ఎట్రాక్ట్ చేసిందో.. ఆ సినిమాల కోసమే జనాలు థియేటర్లకు వెళ్లడం ప్రారంభించారు. అందుకే 2022 లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బంగార్రాజు :

నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. కానీ రిలీజ్ రోజున ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ రోజుల్లో ఈ మూవీ తప్ప ఇంకో పెద్ద సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేసింది. రూ.39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.40 కోట్ల షేర్ ను రాబట్టింది.

2) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కాకపోయినా నెగిటివ్ టాక్ తో ఆ రేంజ్లో కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. రూ.121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.112.94 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

3) ఎఫ్ 3 :

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2’ ఫ్రాంచైజీ లో భాగంగా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. సిల్లీ కామెడీ, లాజిక్ లెస్ కామెడీ అంటూ క్రిటిక్స్ ఏకి పడేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మంచి కలెక్షన్లు సాధించింది. రూ.64 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.55.2 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.




4) గాలోడు :

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది.




5) ధమాకా :

రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే రూ.20.70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.37 కోట్ల షేర్ ను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus