ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్..!

ఫిబ్రవరి అనేది తెలుగు సినిమాలకు అన్ సీజన్ వంటిది అని అంతా అంటుంటారు. ఎందుకంటే మార్చి నెలలో ఇంటర్మీడియట్ మరియు టెన్త్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి.. ఫిబ్రవరి నెల నుండి ప్రేపరషన్ గట్టిగా స్టార్ట్ చేస్తారు విద్యార్థులు. అందుకోసమే ఫిబ్రవరి నెలలో క్రేజ్ ఉన్న సినిమాలు పెద్దగా రిలీజ్ కావు. మేకర్స్ కూడా ఈ సీజన్లో పెద్ద సినిమాలను విడుదల చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ ధైర్యం చేసి రిలీజ్ చేసినా అట్టర్ ప్లాప్ రిజల్ట్స్ మూటగట్టుకున్న క్రేజీ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఈ అన్ సీజన్లో రిలీజ్ అయినా సూపర్ హిట్లు అయ్యాయి. కానీ భారీ కలెక్షన్లు నమోదు చేసిన దాఖలాలు అయితే లేవు. సరే ఇక లేట్ చేయకుండా ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు ఏంటో.. టాప్ 10 లిస్ట్ లో ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.92.28 కోట్ల షేర్ ను రాబట్టి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది.

2) ఉప్పెన :

వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.51.52 కోట్ల షేర్ ను రాబట్టి.. నెంబర్ 2 ప్లేస్ లో నిలిచింది.

3) మిర్చి :

ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2013 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.47.88 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది

4)టెంపర్ :

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2015 ఫిబ్రవరి 13న రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.43 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ హిట్ గా నిలిచింది.

5) నేను లోకల్ :

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2017 ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.33.2 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

6) భీష్మ :

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) ఘాజి :

రానా హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2017 ఫిబ్రవరి 17న రిలీజ్ అయ్యి ఫైనల్ గా రూ.27 కోట్లు షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

8) తొలిప్రేమ :

వరుణ్ తేజ్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018 ఫిబ్రవరి 10 న రిలీజ్ అయ్యి ఫైనల్ గా రూ.23.95 కోట్లు షేర్ ను రాబట్టింది.

9) సార్ :

ధనుష్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రం 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ అయ్యి ఇప్పటివరకు రూ.16.8 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఫుల్ రన్ ముగిసిపోలేదు.

10) డిజె టిల్లు :

సిద్ధూ జొన్నల గడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2022 ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి టోటల్ గా రూ.16.77 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus