Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ‘మోగ్లీ’ రూపొందింది. ఈ డిసెంబర్ 12కి రిలీజ్ కావాలి. అదే డెడ్ లైన్ తో అంతా పనిచేశారు. ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా ‘మోగ్లీ’ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం గత వారం వాయిదా పడ్డ ‘అఖండ 2’ సినిమా. అన్ని అడ్డంకులు తొలగించుకుని డిసెంబర్ 12కి ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Sandeep Raj

అంత పెద్ద సినిమా వస్తుందంటే మిగిలిన సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టం. అందుకే ‘మోగ్లీ’ ని 2026 ఫిబ్రవరికి వాయిదా వేయాలని చూస్తున్నట్టు వినికిడి. ఈ క్రమంలో ‘మోగ్లీ’ దర్శకుడు సందీప్ రాజ్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.సందీప్ రాజ్ తన పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. ” ‘కలర్ ఫోటో’, ‘మోగ్లీ’ వంటి సినిమాలు నాకంటే మరో డైరెక్టర్ తీసుంటే బాగుండేది.అంతా బానే ఉంటుంది అనుకున్న టైంలో రిలీజ్ విషయంలో ఇబ్బంది ఎదురవుతోంది.

ఇందులో దురదృష్టంతో పాటు మరో కామన్ పాయింట్ నేనే. నాదే బ్యాడ్ లక్ కావచ్చు. ‘Directed by Sandeep Raj ’ అనే టైటిల్‌ బిగ్ స్క్రీన్ పై చూడాలనుకున్న తన కల, తపన రోజురోజుకీ భారంగా మారుతుంది, అయినప్పటికీ మోగ్లీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికైనా మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నాడు. సందీప్ ఫ్రస్ట్రేషన్ కి అర్ధం ఉంది. అతను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా కరోనా టైంలో ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

మధ్యలో రవితేజతో సినిమా చేయాలని 3 ఏళ్ళు ఎదురుచూశాడు. కానీ రవితేజ హ్యాండిచ్చాడు. మొత్తానికి మోగ్లీ చేశాడు. మరో 3 రోజుల్లో రిలీజ్ అనగా ‘అఖండ 2’ వల్ల వాయిదా పడే పరిస్థితి. ఇలా జరుగుతుంటే ఏ దర్శకుడైనా ఫ్రస్ట్రేట్ అవ్వడం సహజం.

భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus