టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన నిర్మాత అంటే కచ్చితంగా నాగవంశీ అనే చెప్పాలి. తన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వరుస సినిమాలు నిర్మిస్తూ సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ యంగ్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ 2 ఏళ్ళకు సరిపడగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు.
చిన్న, పెద్ద హీరోలందరితో సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. ఇలాంటి నిర్మాత చేతిలో ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్ కెరీర్ ఆధారపడి ఉంది. ఎలా అంటారా?
2024 ఆగస్టు 15న రిలీజ్ అయిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండో రోజుకే వాషౌట్ అయిపోయింది. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ ఇద్దరూ సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాలు చేశారు. ‘కింగ్డమ్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. జూలై 31న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. కానీ సక్సెస్ ఉంటేనే ఆమె డిమాండ్ పెరుగుతుంది.
అందుకే ‘కింగ్డమ్’ సక్సెస్ ఆమెకు చాలా కీలకం. ఇక రవితేజ విషయానికి వస్తే.. వరుస సినిమాలు చేసే అతను.. ఏడాది కాలంగా ‘మాస్ జాతర’ సినిమాపైనే కూర్చున్నాడు. కచ్చితంగా దీంతో సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. దీనికి కూడా నాగవంశీనే నిర్మాత. ‘కింగ్డమ్’ రిలీజ్ అయిన 4 వారాలకు అంటే ఆగస్టు 27న ‘మాస్ జాతర’ రిలీజ్ కాబోతుంది. కరెక్ట్ గా నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ అవి కరెక్ట్ గా ప్లాన్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాగవంశీపై ఉంది. అలా మిస్టర్ బచ్చన్ హీరో, హీరోయిన్లకి.. పరోక్షంగా నాగవంశీ హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట.