Mrunal Thakur: అలా ప్రకటించారో లేదో వరస కట్టాయి: మృణాల్‌

ఓ సినిమాలో హీరోయిన్‌ నటన అదిరిపోతే ఆ క్యారెక్టర్‌ పేరునే హీరోయిన్‌కి మారు పేరుగా పెట్టేస్తుంటారు మన సినిమా ప్రేక్షకులు. ఆ పాత్రలో ఆ నటి మమేకమైతేనే అలాంటి ఘనత సాధిస్తుంది అని చెప్పొచ్చు. అలా రీసెంట్‌గా వచ్చిన నాయిక బేబమ్మ అలియాస్‌ కృతి శెట్టి. ఇప్పుడు ఇదే తరహాలో పాత్ర పేరును తన పేరుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. ‘సీతారామం’ సినిమాతో ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ త్వరలో తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో కలవనుంది.

సీతా మహాలక్ష్మి పాత్ర గొప్పగా ఉంటుంది అని సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ పాత్రను చాలా అందంగా మలిచారు అని చిత్రబృందం చెబుతోంది. అందుకేనేమో కథ విన్న వెంటనే మృణాల్‌ ఠాకూర్‌… సీతామహాలక్ష్మి పాత్రతో ప్రేమలో పడిపోయిందట. ఈ విషయం ఆమెనే చెప్పింది. హిందీ ‘జెర్సీ’ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు హను రాఘవపూడి నుండి మృణాల్‌కి ఫోన్‌ వచ్చిందట. సీతామహాలక్ష్మి పాత్ర గురించి చెప్పగానే ఆ పాత్రతో ప్రేమలో పడిపోయిందట.

ప్రతి నటికీ సీత లాంటి పాత్ర చేయాలన్న కోరిక ఉంటుందన్న మృణాల్‌… కెరీర్‌లో చాలా అరుదుగా దొరికే పాత్ర ఇదని చెప్పింది. ఆ పాత్రలో చాలా కోణాలుండటం, నటనకు ఆస్కారముండటంతో సీతా మహాలక్ష్మిగా నటించడానికి ఓకే చెప్పాను అని తెలిపింది. 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠీ సినిమాతో వెండితెపై అడుగుపెట్టింది మృణాల్‌. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత అంటే 2018లో ‘లవ్‌ సోనియా’ అనే హిందీ సినిమా చేసింది.

ఆ సినిమా రిలీజ్‌ అయ్యే టైమ్‌కి ఆమె చేతిలో సినిమాలేవీ లేవట. అయితే ‘సీతా రామం’ ప్రకటించగానే అవకాశాలు వరస కట్టాయి అని చెప్పింది. ఇప్పుడు తన చేతిలో అరడజను చిత్రాలున్నాయట. ఇక సీతా మహాలక్ష్మి ఎంత మేర ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే ఆగస్టు 5న వరక వెయిట్‌ చేయాల్సిందే.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus