Mrunal Thakur: ఆ రోల్స్ నచ్చవంటున్న మృణాల్ ఠాకూర్.. ఆ హీరోయిన్లకు భిన్నమంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో సీత పాత్రలో అద్భుతమైన అభినయంతో మెప్పించారు. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో మృణాల్ ఠాకూర్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా పాత్రల ఎంపిక విషయంలో మృణాల్ ఠాకూర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. హాయ్ నాన్న సినిమాతో పాటు ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అయితే ఎంచుకునే పాత్రల గురించి మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మూస పాత్రలు చెయ్యడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. ఒకే లాంగ్వేజ్ కు పరిమితమై ఒకే ఇమేజ్ తో కొనసాగడం తనకు నచ్చదని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. అన్ని భాషల్లో అన్ని రకాల పాత్రల్లో నటించాలని నా కోరిక అని ఆమె కామెంట్లు చేశారు. తాను ఏ భాషలో చేసినా భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటానని మృణాల్ ఠాకూర్ వెల్లడించారు. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమానంగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. మృణాల్ ఠాకూర్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో మృణాల్ ఠాకూర్ కు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. కథ నచ్చితే గ్లామర్ షో చెయ్యడానికి కూడా ఈ బ్యూటీ సిద్ధమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మృణాల్ ఠాకూర్ ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.

నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న మృణాల్ (Mrunal Thakur) రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా మృణాల్ నటిస్తారేమో చూడాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus