మరాఠీలో సినిమాను స్టార్ట్ చేసి.. హిందీలో ఓ స్థాయి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని.. తెలుగులోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. తొలుత సీతగా సాఫ్ట్‌గా పరిచయమైనా.. ఆ తర్వాత తనలో గ్లామర్ లుక్‌ని బయటకు తీసి కుర్రకారు మనసుల్ని మెలితిప్పేసింది. అయితే ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేయడం లేదు. తనకు కాస్త పేరు తెచ్చిన హిందీలో సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో 2025 చాలా స్పెసల్ అట. యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ చేస్తూ.. మరోవైపు రొమాంటిక్ జానర్‌లో ‘హై జవానీ తో ఇష్క్ హోనా’ చేసింది. అలా ఇటు తెలుగు, అటు బాలీవుడ్ సినిమాలను ఓ మోస్తరుగా బ్యాలెన్స్ చేసింది. కొన్నేళ్లుగా దక్షిణాదిలో, బాలీవుడ్‌లో మంచి అవకాశాలను అందుకుంటున్నా.సరిహద్దుల గురించి పట్టించుకోకుండా పనిని, అభిమానాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. రెండు పరిశ్రమల మధ్య భాష తప్ప పెద్దగా ఇంకేం మార్పు లేదు అని తేల్చి చెప్పింది.
అయితే రెండు పరిశ్రమల్లో సినిమా చిత్రీకరణ విధానం భిన్నంగా ఉంటుందని చెప్పింది. అయితే తెలుగు ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తేల్చి చెప్పింది. అయితే సౌత్ సినిమాల్లో నటించడం అనేది తన ప్లానింగ్‌లోనే లేదని చెప్పింది. అనుకోకుండా అలా ఛాన్స్‌లు రావడం, చేసి మంచి పేరు తెచ్చుకోవడం జరిగిపోయాయి అని చెప్పింది.
ఈ ఏడాది కేవలం ఒక్క సినిమానే చేసిన మృణాల్ వచ్చే ఏడాది వరుస సినిమా ఆలోచనలు చేసింది. ‘దో దీవానే సెహర్ మే’, ‘డెకాయిట్’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘పూజా మేరీ జాన్’, అల్లు అర్జున్ – అట్లీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది తొలి అర్ధంలోనే వచ్చేస్తాయి.