Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కి ఇక్కడ మంచి లైనప్ దొరికింది!

2022 లో వచ్చిన ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమాతో ఆమె తెలుగులో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు రావడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. ఆ సినిమాల్లో ఈమె లుక్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ అనే ఫీలింగ్ ని కలిగించాయి. దీనికి ముందుకు హిందీలో ఆమె పలు సినిమాల్లో నటించింది.

కానీ ‘సీతా రామం’ చిత్రానికి లభించిన ఆదరణ.. మరే సినిమాకి కూడా లభించింది లేదు. అయితే ఏడాది దాటినా ఈమె నుండి మరో సినిమా రాలేదు. ఈ క్రమంలో ఈమె గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి.హిందీలో వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్లలో కనిపించింది.కానీ తెలుగులో మృణాల్ డిమాండ్ చేసిన పారితోషికం ఇవ్వకపోవడం వల్లే.. ఎక్కువ సినిమాలకు సైన్ చేయడం లేదు అని అంతా అనుకున్నారు.

కానీ తెలుగులో ఈమె క్రేజ్ ను డబుల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టమవుతుంది. ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం డిసెంబర్ నెల 7 వ తారీఖున రిలీజ్ కానుంది. అలాగే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఇవి కనుక సక్సెస్ అయితే .. ఈమె (Mrunal Thakur) స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయినట్టే..! అందుకే ఈమె టైం తీసుకున్నట్లు సమాచారం.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus