Mrunal Thakur: మ్యాగ్‌జైన్ కోసం ఫొటోషూట్ చేసిన మృణాల్ ఠాగూర్‌ ఫోటోలు వైరల్.!

సీతా రామం’ చిత్రంలో సీతగా చాలా పద్ధతిగా, నిండైన చీరకట్టులో కనిపించి.. అందరి మనసులు దోచేసిన మృణాల్‌.. ఎన్ని సినిమాలు చేసినా.. హీరోయిన్ మృణాల్ ఠాగూర్‌ కి మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే సినిమా ‘సీతా రామం’ ఆ విషయం ఈ భామే స్వయంగా చెప్పింది. ‘సీతా రామం’ చిత్రంతో టాలీవుడ్‌ లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌పై ఇప్పుడందరి కన్ను పడింది. అందుకు కారణం ఆమె యాక్టింగ్ మాత్రమే కాదు.. ఆమె ఎక్స్ పోజింగ్ కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె ఫొటోలను చూస్తే..

నిజంగా ‘సీతా రామం’ చిత్రంలో నటించింది ఈ భామేనా అని అంతా ఆశ్చర్యపోతారు. అంతలా ఆమె ఎక్స్‌ పోజింగ్‌ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. ‘సీతా రామం’ చిత్రంలో సీతగా చాలా పద్ధతిగా, నిండైన చీరకట్టులో కనిపించి.. అందరి మనసులు దోచేసిన మృణాల్‌ను అసలు అలా చూడలేకపోతున్నారు. మంచి హిట్ సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం నాని30 సినిమాలో అవకాశం దక్కించుకున్న మృణాల్ ఠాగూర్‌పై రెండు రోజులుగా భారీగా ట్రోలింగ్ నడుస్తుంది. ఫస్ట్ లుక్ అనే మ్యాగ్‌జైన్ కోసం ఆమె చేసిన ఫొటోషూట్.. మృణాల్‌పై ట్రోలింగ్‌కు కారణం అవుతోంది.

మాములుగా ‘సీతా రామం’ చిత్రంలో అలా నిండుగా కనిపించింది కానీ.. (Mrunal Thakur) మృణాల్ మొదటి నుంచి సోషల్ మీడియాని వేడెక్కిస్తూనే ఉంది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన గుర్తింపుతో, ఇమేజ్‌లో ఆ బోల్డ్‌నెస్‌ని కాస్త తగ్గించుకుంటుందిలే అనుకుంటే.. అబ్బే.. ఇంకాస్త డోసు పెంచింది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ మ్యాగ్‌జైన్ కోసం ఆమె చేసిన ఫొటోషూట్ చూస్తే.. అంతా ఆశ్చర్యపోతారు. ఆ రేంజ్‌లో మృణాల్ ఠాగూర్ గ్లామర్‌ను ఒలకబోసింది. ఈ ఫొటోలను, ఫొటోషూట్‌ను చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

సీతామహాలక్ష్మీ అర్జెంట్‌గా ఆ ఫొటోలను డిలీట్ చెయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత బోల్డ్‌గా అవసరమా? మంచి పాత్రతో వచ్చిన గుర్తింపును కూడా పోగోట్టుకుంటున్నావ్ అనేలా ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మృణాల్‌కి ఇలాంటివి కొత్తేంకాదు. ‘నా జీవితం.. నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా’ అని గతంలోనే మృణాల్ తనని విమర్శించేవారికి కౌంటర్ ఇచ్చింది. అలాంటి భామ.. ఇప్పుడు సడెన్‌గా మారుతుందా? అస్సలు మారదంటే మారదు. ప్రస్తుతం ఆమె గ్లామర్ ఫొటోలు మాత్రం సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నాయి

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus