Mrunal Thakur: బాధ పెడుతున్నందుకు సారీ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైనటువంటి నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు అనంతరం తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే సరైన కథలను ఎంపిక చేసుకుంటూ ఈమె ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈమె నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇలా పలు ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. సైమా అవార్డ్స్ వేడుకలలో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మృణాల్ గురించి మాట్లాడుతూ గతంలో ఒక హీరోయిన్ నేను తెలుగింటికి కోడలుగా వచ్చేయి అంటూ సరదాగా అన్నాను ఆమె ఆ మాటలను నిజం చేసి చూపించింది.

ఇప్పుడు నువ్వు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి కోడలిగా హైదరాబాద్ వచ్చేసే అంటూ మృణాల్ ను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఈమె కూడా ఏ హీరోతో అయినా ప్రేమలో ఉందా అందుకే అల్లు అరవింద్ అలా మాట్లాడారా అంటూ పెద్ద ఎత్తున ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలు చివరికి మృణాల్ కుటుంబ సభ్యుల వరకు చేరడంతో ఆమెకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ కూడా రావడం మొదలయ్యాయి దీంతో ఈ పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా (Mrunal Thakur) మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నా పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలను వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు సారీ ఈ పెళ్లి వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇలా మృణాల్ ఠాగూర్ తన పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించడంతో పూర్తిగా ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus