Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన భామ మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత మళ్లీ హిందీ సినిమాల వైపు ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ, మొన్నటిదాకా తమిళ్ హీరో ధనుష్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ రాగా, తాజాగా ఆమె పేరు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ముడిపెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Mrunal Thakur

ఈ రూమర్స్ మృణాల్ దృష్టికి చేరగానే, ఆమె నవ్వుతూ రిప్లై ఇచ్చింది. “ఇలాంటి పుకార్లు వినడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరో ఊహించుకుని సృష్టిస్తారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఇవన్నీ ఉచిత పీఆర్ స్టంట్స్ లాంటివి,” అంటూ డేటింగ్ వార్తలకు క్లారిటీ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం తమిళ స్టార్ ధనుష్‌తో కూడా ఆమె పేరు జతచేయగా, అప్పుడు కూడా మృణాల్ వెంటనే రియాక్ట్ అవుతూ “అతను మంచి ఫ్రెండ్ మాత్రమే” అని చెప్పింది.

తరచూ సెలబ్రిటీలతో ఆమె పేరును లింక్ చేస్తూ ఇదొక ఒక రూమర్ ని వైరల్ చేస్తుండటంతో, మృణాల్ కు మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అర్ధం అవుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. హిందీలో బిజీగా ఉన్న మృణాల్, వచ్చే ఏడాది తిరిగి తెలుగులో కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా చేస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం వచ్చే మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ చేస్తోన్న బన్నీ– అట్లీ ‘AA22’ లో మృణాల్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందనే బలంగా వినిపిస్తున్న టాక్. అఫీషియల్ గా అనౌన్స్‌మెంట్ ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వస్తే మాత్రం మృణాల్ కెరీర్‌కు మరో పెద్ద మైలురాయి అవుతుందన్నది సినీ వర్గాల నుంచి వినపడుతున్న టాక్.

 

‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus