Mrunal Thakur: మృణాల్ ఆ స్టార్ హీరో తో రొమాన్స్ చేయనుందా..!

సీతారామంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ ఓ బంపర్‌ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు టాక్‌. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని రూపొందించనుంది. సోషియో ఫాంటసీ మూవీగా రానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌.

ఇందులో హీరోయిన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండనుందట.. (Mrunal Thakur) మృణాల్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని అందుకే ఆమెకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ‘విశ్వానికి మించి..’ అంటూ విడుదలైన ఆ పోస్టర్‌లో పంచభూతాలను చూపడంతో ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో మృణాల్‌కు అవకాశం వస్తే అది గోల్డెన్‌ ఛాన్స్‌ అవుతుందని అనుకుంటున్నారు.

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. చిరంజీవి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై ఓ సినిమా చేయనున్నారు. దీనితో పాటే వశిష్ఠతో చేసే చిత్రం కూడా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మృణాల్‌ విషయానికొస్తే నాని ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus