Mrunal Thakur: రేచీకటి సమస్యను దాచి పెళ్లికి సిద్ధమైన నటి!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలలో అందుకున్నారు తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షులముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి

ఈమె నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా తెలుగు సినిమాలతో పాటు ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

తాను రే చీకటి సమస్యతో బాధపడుతున్నానంటూ మృణాల్ కామెంట్స్ చేశారు అయితే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు దాచిపెట్టి తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇక ఈమె తనుకు రేచీకటి సమస్య ఉంది అంటూ కామెంట్ చేయడంతో నిజజీవితంలో తనకు రేచీకటి సమస్య ఉంది

అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఆమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంఖ్‌ మిచోలీ అనే సినిమా చేస్తుంది. అందులో మృణాల్‌కి రేచీకటి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య బయట పెట్టకుండా తనకోసం తన ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటారని ఈమె తెలియజేశారు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విభిన్న పాత్రలలో నటించడం చాలా సవాల్ గా అనిపిస్తుంది అంటూ తన పాత్ర గురించి ఈమె (Mrunal Thakur) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus