Mahesh Babu: మహేష్ బాబు సినిమాను ధోనీ నిర్మించనున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో క్రేజ్ ఉండగా ఈ మధ్య కాలంలో మహేష్ నటించిన సినిమాలన్నీ అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా పూర్తైన వెంటనే మహేష్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కనుంది.

అయితే మహేష్ బాబు హీరోగా నటించే ఒక సినిమాను ధోనీ నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే స్పష్టత లేకపోయినా ఈ సినిమా కచ్చితంగా తెరకెక్కుతుందని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుసగా సౌత్ స్టార్స్ తో సినిమాలను నిర్మించాలని ధోనీ భావిస్తున్నారు. ప్రస్తుతం ధోనీ సౌత్ స్టార్ హీరోలపై దృష్టి పెట్టారు. కన్నడలో పేరున్న హీరోలతో సినిమా చేయాలని ధోనీ భావిస్తున్నట్టు బోగట్టా.

తమిళంలో స్టార్ హీరో విజయ్ తో తెలుగులో స్టార్ హీరో మహేష్ తో సినిమాను తెరకెక్కించాలని ధోనీ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ధోనీ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తుండటంపై ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా రాజమౌళి సినిమాకు మాత్రం ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది.

రాజమౌళి సినిమా షూట్ మొదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని మహేష్ బాబు భావిస్తున్నారు. ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా ఇతర భాషల ప్రేక్షకులకు పరిచయం కావాలని మహేశ్ బాబు అనుకుంటున్నారు. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus