దీపావళికి ముద్ర విడుదల

బ్లాక్ మనీ కారణంగా సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. రాజకీయ నాయకులు తాము ఎన్నికల్లో నెగ్గడం కోసం బ్లాక్ మనీని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సమాజ వ్యవస్థపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన విపరీత ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుని ముద్ర చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చిత్ర సమర్పకుడు నట్టి కుమార్ తెలిపారు. జగపతిబాబు కథానాయకుడిగా ఎన్.కె. దర్శకత్వంలో క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి సారధ్యంలో నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, బ్లాక్ మనీపై పోరాటం చేసే వ్యక్తిగా ఈ చిత్రంలో జగపతిబాబు కనిపిస్తారని చెప్పారు. రాజకీయ నాయకులు బ్లాక్ మనీని ఎలా సంపాదిస్తున్నారు..దానిని ఎన్నికల్లో ఎలా ఖర్చుపెడుతున్నారన్న అంశాన్ని ఈ చిత్రంలో చూపించామని ఆయన వివరించారు. ఇందులో మూడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయని అన్నారు. దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus