2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) మంచి విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్ గా ఇప్పుడు ‘ముఫాసా’ వచ్చింది. ‘ముఫాసా’ స్కార్ ల మధ్య వివాదానికి కారణం ఏంటి? మిలేలే సామ్రాజ్యానికి రాజు కాక ముందు ముఫాసా గతం ఏంటి.? వంటి ఆసక్తికర అంశాలతో ‘ముఫాసా’ ప్రీక్వెల్ ను చాలా చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు బేరి జెన్ కిన్స్. రెండో భాగంలో ముఫాసా వంటి పవర్ ఫుల్ పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు.
దాని వల్ల ‘ముఫాసా’ తెలుగు వెర్షన్ కి మొదటి నుండి మంచి హైప్ ఏర్పడింది. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముఫాసా’ కి (Mufasa The Lion King) ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 5.12 cr |
సీడెడ్ | 1.80 cr |
ఆంధ్ర(టోటల్) | 3.75 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 10.67 cr |
‘ముఫాసా’ (Mufasa The Lion King) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 11 రోజుల్లో రూ.10.67 కోట్ల షేర్ ని కేవలం తెలుగు వెర్షన్ తోనే రాబట్టింది. మిగిలిన వెర్షన్లతో కలుపుకుంటే రూ.11.7 కోట్ల వరకు షేర్ ఉంది. మొత్తంగా ‘ముఫాసా’కి రూ.7.67 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చేసింది. న్యూ ఇయర్ హాలిడేని కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.