Mufasa The Lion King Collections: వర్కింగ్ డేలో కూడా మాస్ జాతర.. అంతా మహేష్ మాయేనా!

2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’  (Mufasa The Lion King ) రూపొందిన సంగతి తెలిసిందే. ఇది సింబా తండ్రి ‘ముఫాసా’ కథ. ‘ముఫాసా’ వంటి పవర్ఫుల్ పాత్రకి మహేష్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పడంతో దీనిపై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 20 న భారీ పోటీలో రిలీజ్ అయిన ‘ముఫాసా’ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి.

Mufasa The Lion King Collections:

పెద్దగా ఈ సినిమాకి ప్రమోషన్ లేకపోయినా.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేదే పెద్ద పబ్లిసిటీ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. దాని వల్ల ఫస్ట్ మండే కూడా ఈ సినిమా కుమ్మేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.85 cr
సీడెడ్ 0.53 cr
ఆంధ్ర(టోటల్) 1.17 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.55 cr

‘ముఫాసా’ (Mufasa The Lion King) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 4 రోజుల్లో ఈ సినిమా రూ.3.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కేవలం తెలుగు వెర్షన్ తోనే ఇంత మొత్తం రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. మిగిలిన వెర్షన్లు కూడా కలుపుకుంటే రూ.4.2 కోట్ల వరకు షేర్ వచ్చిందని వినికిడి. మొత్తంగా ‘ముఫాసా’ ఇప్పటివరకు రూ.0.55 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

మంచు వార్‌లో కొత్త ట్విస్ట్‌.. విష్ణుపై మనోజ్‌ కంప్లయింట్‌!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus