Devara Teaser: దేవర టీజర్ కు డేట్, టైమ్ ఫిక్స్.. ఆ పండుగకే సందడి అంటూ?

2024 సంవత్సరంలో విడుదల కానున్న సినిమాలలో దేవర సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. ఇటు ఎన్టీఆర్, అటు కొరటాల శివ కెరీర్ లో ఈ సినిమ మెమరబుల్ సినిమాగా నిలవడంతో పాటు ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా దేవర సినిమా టీజర్ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. దేవర టీజర్ రిలీజ్ కు ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డిసెంబర్ నెలాఖరు నాటికి దేవర సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ తో సైఫ్ అలీ ఖాన్ పాత్రను ముగించనున్నారని దేవర2 సినిమాలో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారని భోగట్టా. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా విడుదల కావడం లేదు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్, బీజీఎం అందిస్తుండగా అనిరుధ్ రేంజ్ ను ఈ సినిమా పది రెట్లు పెంచడం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ రెండు బ్యానర్ల రేంజ్ ను ఈ సినిమా  మరింత పెంచుతుందని మరి కొందరు చెబుతున్నారు.

ఇతర భాషల్లో సైతం దేవర సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర (Devara) సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ రానున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus