జోరుగా సాగుతున్న మహేష్ 25 వ సినిమా పనులు!

సందేశం నిండిన కమర్షియల్ చిత్రాలను తీసే కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. నగర శివార్లలో క్లైమాక్స్ ని చిత్రీకరిస్తున్నారు. దీనితో పాటు మహేష్ బాబు నెక్స్ట్ చేసే సినిమా పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రానికి వంశీ పైడి పల్లి అన్నీ పక్కాగా సెట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం నెలరోజుల క్రితం డైరక్టర్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు.

అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మంచి పాటలను కంపోజ్ చేయడంలో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని నిర్మాత దిల్ రాజు అనుకున్నారు. అయితే భరత్ అను నేను షూటింగ్ ఇంకా కొనసాగుతుండడంతో సమ్మర్ లో మొదలు పెట్టాలని భావిస్తున్నారు. మార్చి నాటికీ భరత్ అనే నేను సినిమాను పూర్తి చేసినా ఏప్రిల్ ల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus