ప్రభాస్ 20 వ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ తర్వాత  డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అబుదాబిలో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన మార్కెట్ సెట్ లో కొని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ మూవీకి ముహూర్తం కుదిరింది. ఈనెల 6 వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి షూటింగ్ మొదలవుతుందా?.. లేకుంటే సాహో సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందా? అనేది.. ఆ రోజు తెలియనుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..  ఇది ఒక ఫాంటసీ కథని తెలిసింది. అదికూడా 1970 నాటి కాలంలో కథ సాగుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అప్పటి కాలానికి సంబంధించిన సెట్స్, లొకేషన్స్ సెట్ జేసే పనిలో నిమగ్నమయి ఉన్నారు. ఇందులో ప్రభాస్ సరసన డీజే బ్యూటీ, జిగేల్ రాణి పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. ఇప్పుడు సైరా చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus