జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తెలుగు రాష్ట్రాల్లో అవినాష్ గుర్తింపును సంపాదించుకున్నారు. జబర్దస్త్ లో పదుల సంఖ్యలో స్కిట్లు చేసిన అవినాష్ బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడంతో జబర్దస్త్ షోకు దూరమయ్యారు. బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ అరియానాతో లవ్ ట్రాక్ ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచారు. మొదట్లో బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించిన అవినాష్ ఎలిమినేషన్ కు నామినేట్ అయితే మాత్రం ముభావంగా ఉండేవారు.
బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాంఢ్ ఫినాలేకు కొన్ని వారాల ముందే ఎలిమినేట్ అయిన అవినాష్ కు బిగ్ బాస్ షో ద్వారా లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది. బిగ్ బాస్ షో తర్వాత స్టార్ మా ఛానెల్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ ఛానెల్ లోనే కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ లో అవినాష్ అరియానాతో కలిసి స్కిట్లు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ముక్కు అవినాష్ కు పరోక్షంగా సహాయం చేశారు.
ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా తెలంగాణ సర్కార్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముక్కు అవినాష్ తల్లికి సహాయం చేసింది. తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అవినాష్ తల్లి అనారోగ్యం చికిత్స కోసం 60,000 రూపాయల చెక్కును అందజేశారు. మంత్రి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అవినాష్ కు ఆర్థిక సహాయం చేసినట్టు వెల్లడించడం గమనార్హం. తెలంగాణ సర్కార్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.
అవినాష్ జగిత్యాల జిల్లాలోని గొల్లపలి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన వారు కాగా అవినాష్ తల్లి లక్ష్మీరాజం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ షో తర్వాత పలు ఇంటర్వ్యూలలో తల్లి అంటే ఎంతో ఇష్టమని అవినాష్ చెప్పిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!