అనుష్క శెట్టి, షాలినీ పాండే, అంజలి, మాధవన్ కాంబోలో సినిమా!

బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే ప్రధాన తారాగణంగా మార్చి నెలలో అమెరికా లో ప్రారంభం కానున్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ చిత్రం’. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని పలుభాషలలో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ‘హార్రర్ ధ్రిల్లర్’ గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో,గోపి మోహన్, నీరజ కోన లు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియ పరుస్తాము. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభమవుతుందని, 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని, సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియా వారికి చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus