Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

తనని మోసం చేసిన మల్లి(సోనూసూద్) చనిపోయిన తర్వాత నందు(మహేష్ బాబు)ని పార్థుగా భావించి బాసర్లపూడి పంపించేశాడు సిబిఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్(ప్రకాష్ రాజ్). ఆ తర్వాత పార్థు ఫ్యామిలీ నందుని ఎలా రిసీవ్ చేసుకుంది? పూరీ(త్రిష) ని పార్థుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుందా?

Athadu 2

ఈ ప్రశ్నలు భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. వీటికి సమాధానాలు ఇస్తూ అతడు తీస్తే ఎంత బాగుంటుందో కదా? అది సాధ్యం అవుతుందా? అంటే నిర్మాత మురళీమోహన్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. ” ‘అతడు’ సెకండ్ పార్ట్ అంటూ తీస్తే కచ్చితంగా మళ్ళీ అదే డైరెక్టర్, అదే హీరోతో చేస్తాం. వేరే వాళ్ళని పెట్టి చేస్తే ఫస్ట్ జనం ఒప్పుకోరు. కాబట్టి.. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ డేట్లు ఇచ్చి చేద్దాం అంటే.. కచ్చితంగా దాన్ని ‘జయభేరి’ సంస్థ నిర్మిస్తుంది. పార్ట్ 2 చేయడానికి కూడా కథలో పొటెన్షియాలిటీ ఉంది. అప్పట్లో సెకండ్ పార్ట్ ఆలోచన ఉండేది కాదు. కాబట్టి ‘అతడు’ తోనే ఆగిపోయింది. ఒకవేళ తీయాలనుకుంటే ‘అతడు 2’ మంచి ప్రయత్నం అవుతుంది. ‘అతడు’ రీ రిలీజ్ ను యంగ్ స్టర్స్ కూడా చూసి.. ‘అతడు 2’ కావాలని డిమాండ్ చేస్తే.. కచ్చితంగా ప్లాన్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ఇవి నిజంగా మహేష్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే కామెంట్స్ అనే చెప్పాలి.

కానీ ‘అతడు 2’ కి మహేష్, త్రివిక్రమ్ అంత ఈజీగా ఒప్పుకుంటారు అని చెప్పలేం. ఎందుకంటే.. ‘అతడు’ అనేది ఓ క్లాసిక్ మూవీ. మహేష్ బాబు క్లాసిక్స్ ను టచ్ చేయడానికి ఇష్టపడరు. ఇక త్రివిక్రమ్ రెడీ అయినా దానిని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే చేయాలి అంటారు. దానికి మురళి మోహన్ ఒప్పుకునే అవకాశాలు ఉండవు. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి ఆర్టిస్టులు కూడా మరించారు. మిగిలిన ఆర్టిస్టుల ఏజ్..లు ఇమేజ్..లు మారిపోయాయి. సో ఏదో అద్భుతం జరిగితే తప్ప.. ఇది సెట్ అవ్వడం కష్టమే.

‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus