ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘స్పిరిట్’. సుమారు నాలుగేళ్ల క్రితం అనౌన్స్ అయి ఈ సినిమా మరో రెండు నెలల తర్వాత మొదలవుతుంది. ‘ఛస్ ఊరుకోండి చాలా రోజులుగా ఇదే మాట చెబుతున్నారు.. ఇంకా స్టార్ట్ చేయడం లేదు’ అని అంటారా? ఇప్పుడు అప్‌డేట్ ఇచ్చింది దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే. అయితే అప్‌డేట్ చెప్పే క్రమంలో చేసిన కొన్ని కామెంట్స్ వింటుంటే.. ‘సందీప్ చెప్పేది నిజమేనా? చెప్పినట్లు జరిగే అవకాశం ఉందా?’ అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రభాస్ నుండి ఆ ఫీట్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం.
‘యానిమల్’ సినిమా కంటే ముందే ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. 2021 అక్టోబరులో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘యానిమల్’ డిసెంబరు 2023లో విడుదలైన వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నారు. అయితే ప్రభాస్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేస్తాం అని సందీప్ వంగా చెబుతున్నారు. సెప్టెంబరు చివరి వారం నుండి సినిమా చిత్రీకరణ ఉంటుందని, అప్పట్నుండినాన్ స్టాప్‌గా కుమ్మేయడమే అని చెప్పారు సందీప్ వంగా.
సెప్టెంబరులో షూటింగ్ మొదలు పెట్టి నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరిపితే.. ఇంకో ఏడాదిలో సినిమా రెడీ అయిపోతుంది. అంటే 2026 ఎండింగ్‌లోనో లేక 2027 ప్రారంభంలోనే సినిమా రిలీజ్ అవ్వొచ్చు. అయితే ఇక్కడున్న డౌట్స్‌ల్లా ప్రభాస్ వరుసగా అన్ని డేట్స్ ఇస్తాడా? అని. ప్రభాస్ ట్రాక్ రికార్డు, ప్రస్తుత లైనప్ చూసుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ఇప్పుడు ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) ఉన్నాయి. ఇది కాకుండా ‘సలార్ 2’, ‘కల్కి 2’ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ‘స్పిరిట్’కి వరుస డేట్స్ ఎలా ఇస్తాడు? ఒకవేళ ఇస్తే గ్రేటే అని చెప్పాలి.