మురళీ శర్మ (Murali Sharma) నార్త్ కి చెందిన నటుడుగా మొదట పాపులర్ అయ్యారు. కానీ మహేష్ బాబు (Mahesh Babu) ‘అతిథి’ (Athidhi) సినిమా నుండి ఆయన వరుసగా తెలుగులో కూడా ఛాన్సులు దక్కించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన తెలుగులో మహా బిజీ ఆర్టిస్ట్. అయితే నార్త్ కి చెందిన నటుడు అని చాలా మంది అనుకున్నా.. ఆయన తెలుగు వారే అని అతి తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. అవును మురళీ శర్మ సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన గుంటూరు.
ఆయన అక్కడే జన్మించారు. కాకపోతే ముంబైలో పెరిగారు. ముందుగా హిందీ సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టారు. సరే ఇప్పుడు ఈయన టాపిక్ ఎందుకు? అసలు రావు రమేష్ ఉండగా రావు గోపాలరావుతో (Rao Gopal Rao) మురళీ శర్మని పోల్చడం ఏంటి? అనే డౌట్ చాలా మందికి రావచ్చు. కానీ ఇది ఇండస్ట్రీ టాక్. రావు గోపాలరావు ఒకప్పుడు ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందిన నటుడు.
ఆయన విలన్ గా చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా ఆ పాత్రకి నిండుతనం తీసుకొస్తూ ఉంటారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన ‘మజాకా’ (Mazaka) సినిమాలో మురళీ శర్మ రోల్ చాలా బాగా పేలింది. సైకో బిజినెస్ మెన్ గా ఈయన చేసిన పాత్రకి ఆడియన్స్ బాగా నవ్వుకున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల..
ఈయన పాత్రకి రావు గోపాలరావు స్టైల్లో డబ్బింగ్ చెప్పించారు. అది హైలెట్ అయ్యింది. చాలా వరకు మురళీ శర్మ లుక్స్ రావు గోపాలరావుని పోలి ఉన్నాయి అని అంతా అనుకుంటున్నారు. కాకపోతే రావు గోపాలరావు కంటే మురళీ శర్మ కాస్త పొడుగ్గా ఉంటారు. కానీ రావు గోపాలరావు రేంజ్ హైట్స్ కి ఈయన రీచ్ అవుతారా అనేది చూడాలి