A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?
- July 13, 2026 / 02:30 PM ISTByFilmy Focus Desk
‘కత్తి’ సినిమా షూటింగ్ సమయంలో ఓ పాట గురించి చాలామంది, చాలా రోజులు మాట్లాడుకున్నారు. హైదరాబాద్ నగర వాసులు అయితే ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆ పాటను షూట్ చేసింది హైదరాబాద్‌లోనే. అందులోనే రెగ్యులర్ చాలా బిజీగా ఉండే ఏరియా. షూటింగ్ జరుగుతున్న విధానం చూసిన కొంతమంది ఆ విషయాల్ని అందరికీ చెప్పడంతో అప్పట్లో ఆ పాట చాలా వైరల్. అయితే సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ పాట సినిమాలో లేదు. దీంతో అందరూ షాక్ అయ్యారు..
A.R. Murugadoss
ఇన్ని రోజులు ఆ పాట ఎందుకు పెట్టలేదు.. అనే ప్రశ్న అలానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు దీనికి సమాధానం ఇచ్చారు దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. ‘పాలమ్..’ పాట కోసం చాలా ఖర్చు పెట్టాం, ఎంతో శ్రమపడి చిత్రీకరించాం. హైదరాబాద్‌లోని సెన్సిటివ్ ఏరియాలో.. ఎన్నో పర్మిషన్లు తీసుకొని పాట షూట్ చేశాం అని మురుగదాస్ చెప్పారు. ఇక ఆ పాటను సినిమా క్లైమాక్స్‌కి ముందు పెట్టాలని అనుకుని షూట్ చేశారట.

అయితే, సినిమా మొత్తం అయ్యాక ఓ సీక్వెన్స్‌లో సినిమాను చూసినప్పుడు పాట అడ్డంలా అనిపించిందట. ఎమోషనల్ మూమెంటమ్‌ని ఆ పాట దెబ్బ తీస్తుంది అని టీమ్ అనుకున్నారట. సినిమా కథ ఫ్లో డిస్ట్రబ్ చేసే ప్రమాదం ఉండటంతో పాటను సినిమాలో పెట్టకూడదని ఫిక్స్ అయ్యారట ‘కత్తి’ డైరక్షన్ టీమ్. సంగీత దర్శకుడు అనిరుథ్, హీరో విజయ్ కూడా ఇదే మాట అనడంతో ఇక పాటను పక్కన పెట్టేయడమే ఫిక్స్ అయి ఆగిపోయారట.
అయితే, ఆ పాటను ఇప్పుడు చూడాలంటే యూట్యూబ్‌లో 8కె రిజల్యూషన్‌లో ఈ పాట ఉంది. ఓసారి చూసేయండి.. మురుగదాస్ చెప్పిన కష్టం ఏంటి అనేది తెలుస్తుంది.
















