మా వాళ్ళకు నచ్చిందిగా…మురుగుదాస్!

మురుగుదాస్…ఈ దర్శకుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా…తక్కువే అవుతుంది…మంచి కధ, దానికి తగ్గ కధనం అన్నీ వెరసి ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు మంచి టెక్నీషియన్ అనే చెప్పాలి…కానీ ఆ ప్రతిభ తమిళ పరిశ్రమకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పక తప్పదు…ఎందుకంటే ఎంత బడా… హీరో అయినా…ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా…ఇంకా చెప్పాలి అంటే ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా….మురుగుదాస్ తన తమిళ ఫ్లేవర్ దాటి బయటకు వచ్చి సినిమాని తెరకెక్కించలేకపోతున్నాడు…ఇక విషయంలోకి వెళితే…తాజాగా సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్పైడర్.. అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది అని చెప్పక తప్పదు…సినిమా కి వచ్చిన టాక్ ను బట్టి, రివ్యూస్ ని బట్టి, సినిమా బట్టి చూస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అటెంప్ట్ లానే ముగియనుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ సినిమా రిజల్ట్ పై ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ మొదటిసారి స్పందించారు.

ఇంతకీ ఆయన ఈ సినిమా రిసల్ట్ విషయంలో ఎమాన్నారు అంటే.. సినిమా తమిళంలో మంచి టాక్ తెచ్చుకుందని అక్కడ మంచి వసూళ్లనే రాబడుతుందని అన్నారు. సినిమా తమిళ ఆడియెన్స్ కు తన సినిమాలలానే అనిపించిందని అయితే ఓవర్సీస్ ఇంకా తెలుగు ప్రేక్షకులకు సినిమాలో మహేష్ ను సాధారణ వ్యక్తిగా ఊహించుకోలేకపోయారని అన్నాడు మురుగదాస్. ఓవరాల్ గా సినిమా మీద తన సమర్ధతను వెళ్లబుచ్చిన మురుగదాస్ తమిళ ప్రేక్షకులకు మాత్రం నచ్చేసింది అన్నారు. ఇక తెలుగులో మాత్రం ఈ సినిమా నెగటివ్ టాక్ కలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అదే క్రమంలో స్పైడర్ సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు చెబుతున్నారు. ఏది ఏమైనా స్పైడర్ సినిమాపై మురుగదాస్ ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చుకున్నా తమిళ తంబీలకు మాత్రం నచ్చేసింది. అయితే తమిళ తంబీలకు మాత్రం నచ్చితే చాలు అని అనుకుంటే సినిమాని తమిళంలో తీస్తే సరిపోయేదిగా…తెలుగులో ఎందుకు తెరకెక్కించడం…ఈ కధను ఏ తమిళ హీరోతో చేస్తే బావుండేదిగా…తెలుగు హీరోతో ఎందుకు తియ్యడం…మొత్తంగా తాను చేసిన ఫెయిల్డ్ అటెంప్ట్ ని మురుగుదాస్ బాగానే సామర్దించుకున్నాడు అని ఒప్పుకోక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus