Pushpa: పుష్ప సినిమా ఆస్కార్ స్థాయి సినిమా… దేవిశ్రీ కామెంట్స్ వైరల్!

  • September 13, 2023 / 12:32 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సంగీతం అందించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చినటువంటి పుష్ప సినిమాకు గాను దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాకు సంగీతం ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికి పుష్ప సినిమాలో పాటలు ఎక్కడ వినిపించినా బాడీలో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయని చెప్పాలి. అంతలా ఈ సినిమాకు మ్యూజిక్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దేవిశ్రీప్రసాద్ పుష్ప సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.

పుష్ప (Pushpa) సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండాల్సిన సినిమా అని ఈయన తెలిపారు. ఇలా ఈ సినిమా కనుక నామినేషన్స్ లో ఉంటే తప్పకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చేదని దేవిశ్రీప్రసాద్ వెల్లడించారు. ఈ సినిమాకు ఆస్కార్ తీసుకునే స్థాయి ఉన్నప్పటికీ నిర్మాతలు ఎందుకని ఈ సినిమాని ఆస్కార్ పరిశీలనకు పంపించలేదో తెలియదని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

ఒకవేళ పంపించి ఉంటే తప్పకుండా సెలబ్రేషన్స్ చేసుకునే ఓ మంచి న్యూస్ విని ఉండేవాళ్లమని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. అయితే తెలుగు సినిమా మ్యూజిక్ ఆస్కార్ లెవెల్‌కు చేరుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నాడు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus