పవన్ పై మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కామెంట్స్ వైరల్..!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషీ’ ‘గుడుంబా శంకర్’ ‘బాలు’ ‘తీన్ మార్’ ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసాడు మణిశర్మ. చెప్పాలంటే.. ఈ సినిమాలన్నిటిలోనూ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇప్పటి జనరేషన్ వాళ్లకు కూడా ఈ పాటలు బాగా నచ్చుతాయి అనడంలో సందేహం లేదు. అయితే ఒక్క ‘ఖుషీ’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయినవే అని చెప్పాలి. అలా అని ఫలితాలతో పోల్చి.. ఈ సినిమాల్లోని పాటలను తక్కువ చెయ్యడం కూడా కరెక్ట్ కాదు.

ఇదిలా ఉండగా.. తాజాగా మణిశర్మ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మణిశర్మ మాట్లాడుతూ.. “నేను పనిచేసిన హీరోల్లో ప‌వ‌న్ కళ్యాణ్ కు ఉన్నంత మ్యూజిక్ సెన్స్ మరే హీరో దగ్గర చూడలేదు. మ్యూజిక్ సిట్టింగ్స్ లో పవన్ అంత బాగా ఇన్వాల్వ్ అవుతాడు.మా ఇద్దరి కాంబినేషన్ అనగానే.. అంద‌రికీ ‘ఖుషి’ సినిమానే గుర్తుకొస్తుంది. కానీ ‘గుడుంబా శంక‌ర్’ సినిమాలో పాటలు ‘ఖుషి’ని మించే ఉంటాయి. ఆ సినిమాలో అన్ని ర‌కాల పాట‌లు ఉంటాయి. ఆ సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్న టైములో ప‌వ‌న్ నా‌తో ఉండేవాడు.

ఓ పక్క నేను ట్యూన్స్ చేస్తుంటే..మరో పక్క నేల మీద కార్పెట్ వేసుకుని ప‌డుకుని.. ఏదో పుస్త‌కం చ‌దుతూ ఉండేవాడు. ఆ టైములో నేను చేసిన ట్యూన్ ఏదైనా నచ్చితే ఎగిరి గంతేసేవాడు. తనకి ప‌ది కోట్ల చెక్కు ఇచ్చినా అంత ఎమోష‌న్ చూపించాడు. కానీ మంచి ట్యూన్ వినిపిస్తే మాత్రం చిన్న‌పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. ఆయ‌న వ్య‌క్తిత్వం అలాంటిది. ప‌వ‌న్‌తో మళ్ళీ మళ్ళీ సినిమా చెయ్యాలనిపిస్తుంటుంది. కానీ అది నా చేతుల్లో లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus