కుర్రకారు మొబైల్స్ ప్లే లిస్ట్‌లో ‘లవ్‌స్టోరీ’ పాటలు కచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అంతగా అదిరిపోయాయి మరి. ఆ పాటలు హిట్ అవ్వడంలో కీలక పాత్రధారి సంగీత దర్శకుడు పవన్ సీహెచ్. ఆయన తండ్రి విజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్ కావడంతో… అలా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు అని అనుకోవద్దు. ఎందుకంటే సినిమా అవకాశాల కోసం అందరి కుర్రాళ్లలాగే కష్టపడ్డాడు పవన్. పవన్‌తోపాటు ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లట. తిండీనిద్రా మర్చిపోయి రోజంతా, కొత్త సంగీత శబ్దాలు సృష్టించడం, పాడటం లాంటి రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాళ్లట.
అయితే ఈ క్రమంలో ఎంత కష్టపడినా… వారికి తగ్గ వేదిక దొరకలేదట. ఎన్నో ప్రయత్నాలు చేసినా… ఇండిపెండెంట్ మ్యూజిక్ సంస్థలేవీ అవకాశమివ్వలేదట. దీంతో సినిమాల్లో ట్రై చేద్దాం అనుకొని వచ్చారట. ఓ రెండు సినిమాలు పాటలన్నీ ఇచ్చాక… ఆగిపోయాయట. ఆ నిస్పృహలో ఉండగా… ఓ రోజు ఏఆర్ రెహ్మాన్ నుండి ఫోన్ వచ్చిందట. ‘పవన్… నాతో పని చేస్తావా’ అని అడిగారట. రెహ్మాన్ అలా అడగడం వెనుక ఓ కారణం ఉందట.
రెహ్మాన్ గతంలో పవన్‌కు ప్రిన్స్‌పల్ అట. రెహ్మాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేఎం కన్జర్వేటరీ అనే సంగీత కళాశాలలో పవన్ చదువుకున్నారట. రెహ్మాన్ నుండి కాల్ రాగానే… వెళ్లి కలిశారట పవన్. అయితే రెహ్మాన్ పని అప్పగించలేదట. కొన్ని పరీక్షలు పెట్టి… అందులో ఓకే అయ్యాక పనిలో పెట్టుకున్నారట. రెహ్మాన్ పెట్టి పరీక్ష… మాడ్యులర్ వాయించడం.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!