పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా ఇటీవల విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బాగా రన్ అవుతోంది.పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ‘ఓజి’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ప్రధాన కారణం ‘హంగ్రీ చీటా’ అంటూ వచ్చిన గ్లింప్స్ అనే చెప్పాలి. ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా..శత్రువును ఎంచితే మొదలు వేట..చూపు గాని విసిరితే ఓర కంట..డెత్ కోటా కన్ఫర్మ్ అంట..’ అంటూ ఆ గ్లింప్స్ అంచనాలు భారీగా పెంచేసింది.
గ్లింప్స్ కి హైలెట్ కూడా ఆ లిరిక్స్ అనే చెప్పాలి. ‘ఓజి’ కి తమన్ సంగీత దర్శకుడు. కానీ ‘హంగ్రీ చీటా’ సాంగ్ వెనుక అసలు హీరో వేరే ఉన్నాడు. అతను మరెవరో కాదు యువ సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్. కానీ పాట క్రెడిట్స్ లో లిరిక్స్ సెక్షన్ లో రఘురామ్ అని క్రెడిట్స్ ఇచ్చారు. వాస్తవానికి ఆర్.ఆర్.ధృవన్ అంటే రఘురామ్ ధృవన్ అని అర్థం. కానీ ఇది చాలా మందికి తెలీదు. ఓ పక్క సంగీత దర్శకుడిగానే కాకుండా లిరిసిస్ట్ గా, సింగర్ గా కూడా ఇతను రాణిస్తున్నాడు.
సాయి దుర్గ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో ‘నో పెళ్లి’ ‘హే ఇది నేనేనా’ వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ కి లిరిసిస్ట్ గా పనిచేశాడు. అలాగే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో ‘రాధే రాధే..’ , రామ్ పోతినేని ‘స్కంద’ లో ‘నీ చుట్టు చుట్టు’, ‘మ్యాడ్’ లో ‘ప్రౌడ్ సే సింగిల్’, విజయ్ ‘లియో’ లో ‘నే రెడీ’ , ‘ఓజి’ లో హంగ్రీ చీటా, ‘గని’ లో ‘రోమియోకి జూలియెట్టు’ వంటి సాంగ్స్ కూడా ఇతను రాసినవే. అవన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
తర్వాత సంగీత దర్శకుడిగా మారి ‘ఉషా పరిణయం’ ‘లంబసింగి’ ‘క్రేజీ ఫెలో’ వంటి క్రేజీ సినిమాలకు పనిచేశాడు.’మైల్స్ ఆఫ్ లవ్’ లో ‘తెలియదే’ , బాపులో ‘కంగారు పడకు’ వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. త్వరలో రిలీజ్ కానున్న ‘మిత్రమండలి’ కి కూడా ఇతనే సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా ‘జంబర్ గింబర్ లాలా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. యూట్యూబ్లో అది బాగా ట్రెండ్ అవుతుంది.
ఇక సింగర్ గా ‘బొంబాయ్ పోతావా’, ‘డియో డియో’ ‘హంగ్రీ చీటా’ వంటి పాటలు పాడగా అవన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘ఓజి’ తో ధృవన్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో దాదాపు 8 సార్లు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ‘హంగ్రీ చీటా’ సాంగ్ ని వాడారు. పవన్ ఫ్యాన్స్ కి ‘ఓ దశాబ్దకాలం పాటు సెలబ్రేట్ చేసుకునే సాంగ్’ ఇచ్చాడు ధృవన్