జూ.ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ అనే సినిమా వచ్చింది. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 2వ సినిమాగా వచ్చింది. కానీ వాస్తవానికి ఇది మొదటి సినిమాగా ప్రారంభం అయ్యింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో ‘నిన్ను చూడాలని’ అనే ప్రేమ కథా చిత్రం చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఎన్టీఆర్ మొదటి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదే.
2001 మే నెలలో ఆ సినిమా వస్తే.. 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా వచ్చింది. రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యాడు.
అశ్వినీదత్ సమర్పణలో కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సెప్టెంబర్ 27కి 24 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ‘స్టూడెంట్ నెంబర్ 1’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.38 cr |
సీడెడ్ | 2.20 cr |
ఉత్తరాంధ్ర | 2.12 cr |
ఈస్ట్ | 0.90 cr |
వెస్ట్ | 0.86 cr |
గుంటూరు | 0.95 cr |
కృష్ణా | 0.85 cr |
నెల్లూరు | 0.62 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.88 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.70 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.58 cr |
‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.11.58 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.5.58 కోట్ల ప్రాఫిట్స్ తో అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్స్ అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 71 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడి.. ఎన్టీఆర్ కి ఫస్ట్ హిట్ ను అందించింది.