Thaman: మా ఇద్దరికీ హ్యాట్రిక్.. వైరల్ అవుతున్న థమన్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ బాలయ్య సినిమాల కోసం మరింత ఎక్కువగా కష్టపడి పని చేస్తున్నారు. తాజాగా జరిగిన భగవంత్ కేసరి ప్రెస్ మీట్ లో థమన్ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా కడుపు నింపిన మనిషి నందమూరి బాలకృష్ణ అంటూ థమన్ చెప్పుకొచ్చారు. బాలయ్య గురించి మాట్లాడుతూ థమన్ ఎమోషనల్ అయ్యారు. కొన్ని సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ తో ఆడతాయని గొప్ప ఎనర్జీ ఇస్తాయని భగవంత్ కేసరి కూడా అలాంటి సినిమానే అని థమన్ తెలిపారు.

సినిమా అద్భుతంగా ఉందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన వెన్నెముకను నాకు కూడా అతికించారని థమన్ సరదాగా అన్నారు. భగవంత్ కేసరి నిర్మాతలు చాలా కూల్ గా ఉంటారని థమన్ చెప్పుకొచ్చారు. అనిల్ అద్భుతంగా పిక్చరైజ్ చేశారని థమన్ అన్నారు. అనిల్ రావిపూడి మంచి లైఫ్ ఉన్న సినిమాను ఇచ్చారని ఈ సినిమాకు పని చేసిన వాళ్లు దానికి ఆక్సిజన్ నింపారని ఆయన కామెంట్లు చేశారు. అందువల్లే భగవంత్ కేసరి మూవీ ఇంత అద్భుతంగా వచ్చిందని థమన్ తెలిపారు.

నా మొదటి జీతం బాలయ్య భైరవద్వీపం నుంచి తీసుకున్నానని నాకు కడుపు నింపిన మనిషిగా బాలయ్యతో ఎంతో అనుబంధం ఉందని థమన్ అన్నారు. నా తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఆ సినిమా కోసం పని చేశానని థమన్ కామెంట్లు చేశారు. ఈ సినిమాతో అటు బాలయ్యకు నాకు హ్యాట్రిక్ దక్కుతుందని థమన్ (Thaman) చెప్పుకొచ్చారు.

బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిందని ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని థమన్ తెలిపారు. థమన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి మూవీ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉండగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus