సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన కిక్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు థమన్. తక్కువ సమయంలో క్వాలిటీ మ్యూజిక్ అందిస్తాడనే పేరు ఉన్న థమన్ కొన్నిసార్లు ట్యూన్లను కాపీ చేశాడని విమర్శలు వినిపించాయి. అయితే థమన్ మాత్రం చాలా సందర్భాల్లో తాను ట్యూన్లను కాపీ చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే 2021 సంవత్సరంలో ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే థమన్ చేతిలోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయి.
థమన్ సంగీతం అందించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ అవుతుండటంతో దర్శకనిర్మాతలు థమన్ కు అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. నేపథ్య సంగీతం అద్భుతంగా ఇస్తాడని పేరు ఉండటంతో థమన్ కు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా థమన్ కు ఆఫర్లు వస్తుండటం గమనార్హం. గత వారం విడుదలైన నాగార్జున వైల్డ్ డాగ్, పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమాలకు థమన్ సంగీతం అందించారు.
వైల్డ్ డాగ్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడని ప్రశంసలు వ్యక్తం కాగా యువరత్న సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పునీత్ ఫ్యాన్స్ ను నచ్చాయి. మూడు రోజుల తర్వాత రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ సినిమాకు కూడా థమన్ సంగీత దర్శకుడు కావడం గమనార్హం. ఈ నెలలోనే విడుదల కాబోయే టక్ జగదీష్ సినిమాకు కూడా థమన్ సంగీత దర్శకుడు అనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలతో పాటు బోయపాటి శ్రీను బాలకృష్ణ మూవీ, సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇవి మాత్రమే కాక హిందీ, మలయాళ సినిమాలకు కూడా థమన్ సంగీతం అందిస్తుండటం గమనార్హం.
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!