భారతీయ సంగీత పరిశ్రమకు మరొక కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సంగీత స్వరకర్త బప్పి లహరి మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. తాజా మీడియా నివేదికల ప్రకారం 70 ఏళ్ల ఈ సంగీత దర్శకుడు ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఇటీవల బప్పి ఆరోగ్యం బాగానే ఉందని టాక్ వచ్చింది. సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
కానీ మంగళవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. బప్పీ లహరి అబ్స్ స్ట్రాక్టవ్ స్లీప్ అప్నియా (OSA) కారణంగా మరణించాడని బప్పికి చికిత్స చేసిన డాక్టర్ దీపక్ నంజోషి ధృవీకరించారు. బప్పి అసలు పేరు అలోకేష్ లహరి. అతను 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించాడు. బప్పి 1972లో బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. వెంటనే అతను DJ స్టైల్ ట్యూన్‌లతో కీర్తిని పొందాడు.
మొదట్లోనే అతను భారీ ప్రజాదరణ పొందాడు. బప్పి లహరి తెలుగులో కూడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ అంధించారు. సూపర్ స్టార్ కృష్ణ యొక్క ‘సింహాసనం’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది మంచి అవకాశాలు అందుకున్నారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్లీడర్’ టాలీవుడ్‌లో బప్పి యొక్క అతిపెద్ద మ్యూజికల్ హిట్‌లలో ఒకటి. ఆ తరువాత ఆయనకు తెలుగులో ఎక్కువగా అవకశాలు వచ్చినప్పటికీ ఎందుకో కాస్త దూరంగానే ఉన్నారు.
మెలోడీ మాస్ పాప్ సాంగ్స్ ఇలా అన్ని రకాల మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు. బప్పీ లహరి మ్యూజిక్ కోసమే అప్పట్లో జనాలు థియేటర్స్ కు వచ్చేవారు. బప్పికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారు కూడా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్నారు. 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఆయన క్రియారహితంగానే ఉన్నారు. బప్పి లహరి ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.