నా జీవితం యుద్ధభూమిలో మొదలైంది : మురళీధరన్

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా ‘800’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతి నటించడాన్ని ఓ వర్గం ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. శ్రీలంక మత వాదానికి మద్దతు పలికిన మురళీధరన్ లాంటి వ్యక్తి బయోపిక్ లో నటించడానికి సిగ్గు లేదా అంటూ విజయ్ సేతుపతిని దారుణంగా ట్రోల్ చేశారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా వంటి వారు విజయ్ ని సినిమా నుండి తప్పుకోమని హెచ్చరించారు. రీసెంట్ గా నటి రాధికా శరత్ కుమార్.. విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నటుడిగా తనకు నచ్చిన పాత్రలో నటించే హక్కు విజయ్ కి ఉందంటూ ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు అంతేకాదు.. ముర‌ళీధ‌ర‌న్ ఐపీఎల్‌లో కోచ్‌గా స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు కోసం పని చేస్తున్నారని..

దాన్ని స‌న్ టీవీ యాజ‌మాన్యం నడిపిస్తుందని.. మ‌రి ఇన్నేళ్లుగా వాళ్ల మీద వ్య‌తిరేక‌త ఎందుకు చూపించలేదంటూ ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వివాదంపై మురళీధరన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ లెటర్ షేర్ చేశారు. తనకు వివాదాలు కొత్తేమీ కాదని.. క్రికెట్ కెరీర్ లో ఎన్నో చూశానని అన్నారు. ‘800’ సినిమా ఉద్దేశాన్ని కొన్ని వర్గాలు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నారని అన్నారు. తన జీవితం యుద్ధభూమిలో మొదలైందని, ఏడేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నానని.. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవించానని అన్నారు. శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా అంటూ ప్రశ్నించారు. తను ఇండియాలో పుట్టి ఉంటే ఇండియన్ టీమ్ కి ఆడేవాడినని అన్నారు.

తనపై రాజకీయ రంగు పులిమారని.. తను చేసిన వ్యాఖ్యలు తప్పుచేసి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి తను ఎదుర్కొన్న కష్టాలను, క్రికెట్ లో సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారని.. తమిళుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి తన కథను వెండితెరపై చూపించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus