కేవలం మూడే మూడు సినిమా తీశాడు దర్శకుడు…కొరటాల శివ…అయితే ఏం….టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడైపోయాడు….తొలి సినిమా ‘మిర్చి’ని అప్పటి ప్రభాస్ కరియర్ లో టాప్ హిట్ గా నిలిపాడు….మలి సినిమా ‘శ్రీమంతుడు’ ఇప్పటికీ మహేష్ కరియర్ లో సూపర్ సూపర్ హిట్ మూవీ…ఇక తాజా జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కరియర్ లోనే టాప్ హిట్ మూవీగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది…ఇదిలా ఉంటే….మూవీ అంత సూపర్ హిట్ అయినప్పటికీ….అక్కడక్కడా చిన్న చిన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి….ఇంతకీ ఏంటి అవి అంటే….ఈ సినిమా సమంత రోల్ పై చాలా విమర్శలు వస్తున్నాయి…సమంతకు సరైన రోల్ ఇవ్వలేదని.. ఆమె రోల్ నిడివి సరిగ్గా లేదని.. కొరటాల ఆమె ఫ్యాన్స్ కు అన్యాయం చేశాడని చాలా విమర్శలు టాలీవుడ్ లో కొరటాలపై చక్కెర్లు కొడుతున్న వేళ…వాటికి సమాధానం ఇచ్చిన కొరటాల…
అసలు నా సినిమాలో పాత్రను..దాని నిడివిని డిసైడ్ చెయ్యడానికి మీరెవరు? సినిమాలో ఏ పాత్ర అయినా కూడా ఎంత సేపు ఉంది అనే విషయం ముఖ్యం కాదని.. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే విషయమే ముఖ్యం అని, అంతెందుకు….సినిమాలో రాజీవ్ పాత్రం 7-8నిమిషాలు ఉంటుంది…..ఎన్టీఆర్-మోహన్ లాల్ కి వచ్చినంత క్రేజ్ వచ్చింది…అయినా ప్రాముఖ్యత లేని పాత్రలో సినిమా మొత్తం ఉండే కన్నా….కనిపించిన కొన్ని నిమిషాల్లో ఆ పాత్ర ఎంతటి ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిందో చూడాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు మన కొరటాల. అంతేగా మరి….పాత్ర ముఖ్యం కానీ…దాని నిడివి కానే కాదు!!