నా డ్రీమ్ నెరవేరింది… నాకు అది చాలు : నిహారిక

‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. మొదటి చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో సుమంత్ అశ్విన్ తో కలిసి ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ‘వెబ్ సిరీస్ కి ఎక్కువ సినిమాకి తక్కువ’ అనే కామెంట్స్ ఇచ్చారు ప్రేక్షకులు. ఈ చిత్రాన్ని నిహారిక చాలా ప్రమోట్ చేసినప్పటికీ లాభం లేదు. ఇక నిహారిక నుండీ వస్తున్న మరో చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఇది కూడా వెబ్ సిరీస్ తరహా లోనే సాగుతున్నట్టనిపిస్తుంది. ‘నిహారిక కి ఇంత కష్టం ఎందుకు..? పెద్ద ఫ్యామిలీ నుండీ వచ్చిన హీరోయిన్ కదా… సో పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఈజీగా సక్సెస్ ట్రాక్ ఎక్కేయ్యోచు కదా..? అని ప్రేక్షకుల్లో ఇప్పటికే రక రకాల ప్రశ్నలున్నాయి. దీనికి నిహారిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

నిహారిక మాట్లాడుతూ… “అప్పట్లో హీరోయిన్లకు లాగా నేను 10-15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండిపోవాలని అనుకోవడం లేదు. నాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఇంట్లో వాళ్ళు నాకు 30 ఏళ్ళ లోపు పెళ్ళి చేసేస్తాం అన్నారు. నాకు చాలా తక్కువ టైమ్ ఉంది. కాబట్టి నా మనసుకు నచ్చిన సినిమాలే చేసుకుంటాను. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రేమే చేయాలని కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. పెద్ద హీరోల సినిమాల్లో చేయడం సమస్యకాదు, కానీ నాకున్న టైమ్ లో నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. అయినా అందరికంటే పెద్ద హీరోతో నటిస్తున్నప్పుడు ఇక మిగతా పెద్ద హీరోలతో నటించాల్సిన అవసరం ఏముంది.నిజం చెబుతున్నా… పెద్ద హీరోల సినిమాలేవీ ఇప్పటివరకూ నా దగ్గరకు రాలేదు. నేనేంటో, నేనెలాంటి సినిమాలు చేస్తానో వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఒకే ఒక్క పెద్ద హీరోతో నటించాలనే డ్రీమ్ ఇప్పటివరకూ నాకు ఉంది. అది చిరంజీవి గారితో మాత్రమే. ఇప్పుడు ‘సైరా’ చిత్రంతో నా డ్రీమ్ నెరవేరింది. నాకది చాలు. అంతకంటే ఇంకేంకావాలి” అంటూ చెప్పుకొచ్చింది ఈ మెగా డాటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus