“నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్ జి కె అని పిలుస్తారు”

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’,’రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘NGK’ (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం టీీజర్ విడుదల చేశారు.

“నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్ జి కె అని పిలుస్తారు” అని సూర్య చెప్పే డైలాగ్ తో మొదలయ్యే టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రెపే లా ఉంది. సాయి పల్లవి చెప్పే “గోపాలా పోరా నాన్నా నువ్వెళ్తే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది” అనే డైలాగ్ తో ఎన్ జి కె హై ఓల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా అలరించనుంది.

సింగం సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus