మొదటి ఆడిషన్ లోనే మిస్కిన్ చేత శభాష్ అనిపించుకొన్న లవ్లీ!

కాంబినేషన్స్, బడ్జెట్, కమర్షియల్ ఎలిమెంట్స్ గట్రా హడావుడి లేకుండా సినిమాలు తెరకెక్కించే అతితక్కువమంది దర్శకుల్లో మిస్కిన్ ఒకరు. ఆయన సినిమాలో హీరోలకు మాస్, క్లాస్ అనే ఇమేజ్ ఉండదు.. ఒక క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. అసలు మిస్కిన్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకోవాలంటే.. అందం, అభినయ సామర్ధ్యం ఉంటే సరిపోదు.. అంతకుమించిందేదో కావాలి. రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా రిజెక్ట్ చేసిన రికార్డ్ మిస్కిన్ ది.

అలాంటి మిస్కిన్ ను సింగిల్ ఆడిషన్ లో మెప్పించింది ఒక అమ్మాయి. విశాల్ కథానాయకుడిగా “డిటెక్టివ్ 2” చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నద్ధమవుతున్న మిస్కిన్ ఈ చిత్రంలో కథానాయిక కోసం గత కొంతకాలంగా వెతుకుతూనే ఉన్నాడు. మొదటి పార్ట్ లో అను ఎమ్మాన్యూల్ కథానాయికగా కనిపించింది. సెకండ్ పార్ట్ లో లవ్లీ సింగ్ కనువిందు చేయనుంది. ఈ సక్సెస్ ఫుల్ సినిమాకి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది. మిస్కిన్ ను ఇంప్రెస్ చేసిన లవ్లీ సింగ్ పై ఇప్పుడు మన తెలుగు దర్శకనిర్మాతల కన్ను కూడా పడింది. అమ్మడి కోసం తెలుగులో ఎంక్వైరీలు భారీగా పెరిగాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus