ఒక జోనర్లో ఓ సినిమా వచ్చి ఊహించని సక్సెస్ కొట్టింది అంటే.. వరుసపెట్టి అలాంటి జోనర్లలోనే సినిమాలు చేయాలని మేకర్స్ డిసైడ్ అవుతారు. గతంలో ఫ్యాక్షన్ సినిమాలు ఓ ఊపు ఊపాయి. ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) ‘ఇంద్ర’ (Indra) వంటి సినిమాల కోసం జనాలు థియేటర్లకు తండోపతండాలుగా పరుగులు తీశారు. ఆ తర్వాత లవ్ స్టోరీస్ హవా, ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాల హవా.. ఇలా ఒక్కో టైంలో ఒక్కో జోనర్ హవా నడిచింది.
ఇప్పుడైతే ఫిలిం మేకర్స్ అంతా మైథలాజికల్ ట్రెండ్ పై పడినట్లు తెలుస్తుంది. ‘కార్తికేయ2’ (Karthikeya) ‘హనుమాన్’ (Hanuman) ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో వరసపెట్టి మైథలాజికల్ సినిమాలు రూపొందుతున్నాయి. ఆఖరికి అనసూయ (Anasuya) సినిమాకి కూడా మైథలాజికల్ టచ్ ఇస్తున్నారట. వివరాల్లోకి వెళితే.. అనసూయ ప్రధాన పాత్రలో ‘అరి’ అనే సినిమా రూపొందుతుంది. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కూడా మైథలాజికల్ టచ్ ఇస్తున్నారట.
అరిషడ్వర్గాలను తొలగించే కృష్ణుడి పాత్రని తెరపైకి తీసుకురాబోతున్నారట. ఓ సీన్లో కృష్ణుడిని చూపించి గూజ్ బంప్స్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అనసూయ వల్లే ఇప్పటివరకు ఈ సినిమా వార్తల్లో నిలిచింది. అయితే థియేటర్లలో నిలబడాలంటే మైథలాజికల్ టచ్ ఇవ్వాలనేది మేకర్స్ ఆలోచన కావచ్చు. ఇక అనసూయతో పాటు ఈ సినిమాలో సాయి కుమార్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.
వచ్చే ఏడాది విశ్వంభర (Vishwambhara) , జై హనుమాన్, కల్కి పార్ట్ 2, నిఖిల్ (Nikhil Siddhartha) స్వయంభు (Swayambhu) , కార్తికేయ 3 అంటూ తెరపై ఏదో మాయాజాలం చేయబోతున్నారు. మైథలాజికల్, సోషియో ఫాంటసీ అందరినీ వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.