Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Advertisement

ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘బైకర్’ (Biker) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా అద్భుతాలు చేయలేడం లేదు కానీ ఓకె ఓకె అనే విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది. శర్వానంద్ (Sharwanand) నటనకు, టెక్నికల్ వాల్యూస్‌కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం శర్వా చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో శర్వా ఊర మాస్ లుక్లో కనిపించనున్నాడు.

Sharwanand

మరో వైపు ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాణంలో శర్వానంద్ (Sharwanand) – శ్రీను వైట్ల కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. సంక్రాంతి 2027 టార్గెట్ గా ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. టాప్ రైటర్స్ నందు – భాను ..లని శ్రీను వైట్లకు అప్పగించి స్క్రిప్ట్ డెవలప్ చేయమని మైత్రి నిర్మాతలు ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుండీ మైత్రి సంస్థ తప్పుకుందట. దీంతో శ్రీను వైట్ల, శర్వానంద్ వేరే నిర్మాత కోసం ప్రయత్నించారట. వారి ప్రయత్నం కూడా ఫలించినట్టు తెలుస్తోంది.

ఓ కొత్త బ్యానర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జూన్ నుండీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. 2027 సంక్రాంతి బరిలోనే ఈ సినిమాని దించాలనే ప్లాన్ ఉంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శ్రీను వైట్ల. విశ్వం తో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నాడు. ఈసారి మాత్రం గురి తప్పకూడదు అని స్క్రిప్ట్ పనులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. చూద్దాం.. మరి ఈ సినిమాతో అయినా శ్రీను వైట్ల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus