Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

‘దేవర’ సినిమాకు సీక్వెల్‌ ఉందా?.. ఈ ప్రశ్ ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చినా.. సినిమా టీమ్‌ కచ్చితంగా ‘యస్‌ ఉంది’ అనే చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఇటు ఎన్టీఆర్‌ వేరే సినిమా స్టార్ట్ చేసేశాడు, ఆ తర్వాత లైన్‌లో మరో సినిమా పెట్టేశాడు. ఇక దర్శకుడు కొరటాల శివ అయితే వేరే సినిమాను అనౌన్స్‌ చేసేశారు. దీనికి కారణమేంటి? ఎందుకు ఆ సినిమా లేదు అనే ప్రశ్న వేస్తే.. ‘ఆ సినిమా సెటప్‌కి అవసరమైన పరిస్థితులు లేవు’ అని చెబుతారు. ఎప్పటికైనా చెబుతారేమో చూడాలి.

Dragon

ఇప్పుడు ఇలాంటి కష్టమే మరో సినిమాకు వచ్చింది అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే ఈసారి వాటిని దాటుకొని వస్తారు అనే అనిపిస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది పడుతుంది అంటున్న సినిమా ‘డ్రాగన్‌’. ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా ఇది. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన కొద్ది రోజులకే అభిమానులకు నిరాశ ఎదురైంది. దానికి కారణం సినిమా గురించి వరుసగా బ్యాడ్‌న్యూస్‌ వినిపిస్తుండటమే. ఈ మేరకు ఈ సినిమా గురించి ఇప్పటివరకు రకరకాల పుకార్లు వినిపించాయి.

తొలుత సినిమా కథ విషయంలో ఏవో ఇబ్బందులు వచ్చాయన్నారు. అందుకే షూటింగ్‌ ఆపేశారు అని అన్నారు. ఆ తర్వాత బడ్జెట్‌ సమస్యలు ఏవో ఉన్నాయి.. అందుకే సినిమాకు హాల్ట్‌లు పడుతున్నాయి అని అన్నారు. అవన్నీ కాదని, తేలిపోయాయి అని అన్నారు. త్వరలో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అన్నారు. అన్నట్లుగానే అయింది కూడా. ఇప్పుడు ఎన్టీఆర్‌ గాయపడటం, సర్జరీ చేయించుకోవడంతో సినిమా షూటింగ్‌ మళ్లీ ఆగిపోయింది. దీంతో సినిమా టీమ్‌కి ఇబ్బందులు వచ్చాయి అని అంటున్నారు.

దానికి కారణం బడ్జెట్‌ అని చెబుతున్నారు. సినిమా పూర్తవ్వడానికి ఇంకా మూడు నెలలు కావాలట. అంటే ఓ పెద్ద సినిమా ఫుల్‌ డేట్స్‌. ఇప్పటివరకు భారీగానే ఖర్చయిన నేపథ్యంలో మళ్లీ ఇంత మొత్తం డబ్బులు పెడితే ఫైనాన్సియల్‌గా సినిమా రిస్క్‌లో పడ్డట్లే అని చెబుతున్నారు. ఇంత పెట్టాక అంత మార్కెట్‌ కాకపోతే సినిమాకు ఇబ్బంది వస్తుంది. తొలి పార్టుకి లాభాలు వస్తేనే రెండో పార్టు త్వరగా స్టార్ట్‌ అవుతుంది. లేదంటే పూర్తిగా ఆపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ లెక్కల నడుమే ‘దేవర 2’ ఆపేశారని ఓ టాక్‌.

ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus