Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

మన్సూర్‌ అలీ ఖాన్‌.. ఈ పేరు చెబితే ఆయనను అంత ఈజీగా గుర్తు పట్టరు కానీ.. ఆయన ఫొటో చూస్తే బాగానే గుర్తుపడతారు. పైన ఫొటోలు ఉన్నది ఆయనే. సినిమాల్లో రౌడీ పాత్రలతో ఎంత గుర్తింపు సంపాదించారో, బయట చేసే కొన్ని కామెంట్లతో కూడా అంతే పాపులర్. తాజాగా మరోసారి తన కామెంట్లతో టాక్‌ ఆఫ్‌ ది కోలీవుడ్‌ అయ్యారు. ఈసారి ఆయన కామెంట్లు సూర్య రీసెంట్‌ సినిమా మీద. ఆ సినిమాలో మన్సూర్‌ అలీ ఖాన్‌ కూడా నటించారు. కానీ సినిమాలో చూస్తే కనిపించలేదట.

Mansoor Ali Khan

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమాలోనే మన్సూర్‌ అలీ ఖాన్‌ నటించారు. అయితే సినిమా చూసేటప్పటికి అందులో తన సీన్స్‌ లేవు అని చెప్పాడు. ‘కరుప్పు’ కోసం ఎంతో శ్రమించానని, కానీ ఫైనల్ కట్‌లో తన సీన్స్‌ లేకపోవడం బాధగా అనిపించింది అని చెప్పారు. అయితే ఆ సీన్స్‌ యూట్యూబ్‌లో పెడతాం అని చెప్పారు కానీ ఇంకా చేయలేదు అని చెప్పారు.

సినిమాలో నా కృషిని పరిగణనలోకి తీసుకోకపోవడం నాకు బాధగా అనిపించింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో మన్సూర్ అలీ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరుప్పు’ సినిమాలో ‘నాంగ నాలు పేరు.. ఎంగలక్కు భయం కిడయతు..’ అనే పాటలో నేను విలన్లతో కలసి డ్యాన్స్ చేశాను. ఈ సినిమాలో నా నటనను, నా కష్టాన్ని నా కొడుకులకు చూపించాలని అనుకున్నాను. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించారు. నువ్వు నటించిన సీన్ ఎందుకు తీసేశారని నా పిల్లలు అడిగినప్పుడు నా చేతుల్లో ఏం లేదని చెప్పాను అని తెలిపారు.

నా సీన్‌ను ఎందుకు దాచారు. ఒక నటుడి కృషిని ఎందుకు నీరుగారుస్తున్నారు. హీరోకి తెరపై ఎక్కువ సమయం దక్కింది. నా లాంటి నటుడిని బ్యాగ్రౌండ్ నటుడి స్థాయికి పరిమితం చేశారు. నన్ను దాచిపెట్టి, మిమ్మల్ని మీరు గొప్పవారుగా చూపించుకుంటున్నారు. అసలైన ‘కరుప్పు’ని నేనే అని మన్సూర్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.

అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus