Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ మరో డేరింగ్‌ స్టెప్‌

మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే వాళ్ల విజయాల శాతం ఎక్కువ ఉండటంతో నిర్ణయాల విషయంలో గట్టిగానే ఆలోచిస్తుంటారు అనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ‘ఉప్పెన’తో మంచి హిట్‌ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబుకు తర్వాతి సినిమా కోసం రెమ్యూనరేషన్‌ భారీగా ఇస్తున్నారని టాక్‌. బుచ్చిబాబు తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం విదితమే.

‘నాన్నకు ప్రేమతో’ సమయంలో ఎన్టీఆర్‌, బుచ్చిబాబుకు మధ్య స్నేహం ఏర్పడింది. ఆ విషయాన్ని ‘ఉప్పెన’ సమయంలో చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. దీంతో బుచ్చిబాబు త్వరలో ఎన్టీఆర్‌తో సినిమా చేయొచ్చు అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే బుచ్చిబాబు ఓ సినిమా చేస్తున్నాడని ఇప్పుడు టాక్‌. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథ పాయింట్‌ను ఎన్టీఆర్కు బుచ్చిబాబు చెప్పాడని టాక్‌. తారక్‌కు ఆ పాయింట్‌ బాగా నచ్చడంతో దానిని డెవలప్‌ చేసే పనిలో ఉన్నాడట.

ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా అనేసరికి నిర్మాణ సంస్థ మైత్రీ ఎంటర్‌టైన్మెంట్‌ మరోసారి భారీ బడ్జెట్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా బుచ్చిబాబు ₹8-₹10 కోట్ల వరకు ఇవ్వడానికి ఓకే అయ్యారని తెలుస్తోంది. అయితే రెండో సినిమాకే బుచ్చిబాబుకు అంతిస్తున్నారా? లేక ఇది పుకారుగా మిగిలిపోయే వార్తనా అనేది త్వరలో తెలుస్తుంది. అన్నట్లుగా గతంలో ఇలా రెండో సినిమాకే ఇంత డబ్బు తీసుకున్న దర్శకులు ఉన్నారనుకోండి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus