రూమర్లను తిప్పికొట్టిన నా పేరు సూర్య చిత్ర బృందం!

  • February 1, 2018 / 06:16 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్ వ్యవహారం ముగిసి పోయిందనుకునేలోపు.. కాపీ కథల రచ్చ మొదలయింది. అజ్ఞాతవాసి సినిమా వ్యవహారం అనేక సినిమాలపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరక్టర్ గా మారి చేస్తున్న నా పేరు సూర్య కూడా కాపీ కథ అని కొంతమంది గోల చేస్తున్నారు. 2002లో “ఫైండింగ్ ఫిష్” అనే నవల స్ఫూర్తిగా తీయబడిన “”యాంట్ వోన్ ఫిషర్” అనే సినిమా కథ ఆధారంగానే వక్కంతం వంశీ  నా పేరు సూర్య కథ అల్లుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. “నిగ్రహం అనే పదానికి అర్థమే తెలియని ఒక యువకుడు అతని కోపం కారణంగా సైన్యంలో కొన్ని శిక్షలకు గురవుతాడు. అతని కోపంపై ఉన్న ఫిర్యాదులతో ఒక సైక్రియాటిస్ట్ వద్దకు పంపిస్తారు.

అతడి వద్ద ఆ యువకుడుని వైద్యం చేయించుకొమంటారు. ఆ సైక్రియాటిస్ట్ ఆ యువకుడి తండ్రి కావడం, అతడు ఆ యువకుడుకి ఎటువంటి జబ్బు లేదు అని క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు”.. అనే మూల కథకు స్వల్ప మార్పులు చేశారని కొంతమంది పోస్టులు చేస్తున్నారు. నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ లో అల్లు అర్జున్ పాత్రకు ఈ కథలోని పాత్రకు మ్యాచ్ కావడంతో… ఈ వార్తలు నిజమేమోనని అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనిపై నేడు నా పేరు చిత్ర బృందం స్పందించింది. తమది ఏ చిత్రానికి కాపీ కాదని స్పష్టం చేసింది. కథపై ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus