Nabha Natesh: నిఖిల్‌ పాన్‌ ఇండియా మూవీలో ఇస్మార్ట్‌ నాయిక… ఇప్పటికైనా?

నభా నటేశ్‌(Nabha Natesh) … తెలుగులో నటించినివి తక్కువ సినిమాలు కావొచ్చు. కానీ తెలుగు కమర్షియల్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అని పేరు తెచ్చుకుంది. సుధీర్‌బాబు (Sudheer Babu) ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈ కన్నడ అందం ఆ తర్వాత మరో సినిమా చేసినా సరైన విజయం అందుకోలేదు. అయితే పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) – రామ్‌ (Ram) సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో (iSmart Shankar) ఊహించని విజయం అందుకుంది. అయితే ఆ జోరును నిలుపుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాల్లోకి వచ్చి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని చూస్తోంది.

ఈ మేరకు ఆమె గత కొన్ని రోజులగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కుర్ర హీరోలతో ఒకట్రెండు సినిమాలు చర్చల వరకు వచ్చినా అవేవీ వర్కవుట్‌ కాలేదు. అయితే నిఖిల్‌ కొత్త సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది అని అంటున్నారు. ప్రస్తుతం నిఖిల్‌ ‘స్వయంభు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సరికొత్త గెటప్‌లో వైవిధ్యమైన కథతో ఆయన సినిమా చేస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండగా… అందులో ఓ పాత్ర ఇప్పటికే సంయుక్తా మీనన్‌కు ఇచ్చారు. ఆ రెండో హీరోయిన్‌ నభా అని అంటున్నారు.

యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో నిఖిల్‌ (Nikhil) ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన యోధురాలిగా నభా నటేశ్ కనిపిస్తుంది అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ తదితర విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. త్వరలో నభా కూడా శిక్షణ తీసుకుంటుంది అని చెబుతున్నారు. మరోవైపు రెండు కథానాయిక పాత్రలూ మెప్పించేలానే ఉంటాయని, ఫస్ట్ హీరోయిన్‌ సెకండ్‌ హీరోయిన్‌ అనే మాటే లేదు అంటున్నారు.

ఇక నభా నటేశ్‌ సంగతి చూస్తే… 2021లో ‘మేస్ట్రో’ (Maestro) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఏదో ప్రమాదం జరిగిందని, తీవ్రంగా గాయపడిన నభా కోలుకుని ఇప్పుడు సినిమాలకు సిద్ధమైందని అంటున్నారు. అయితే ఏం ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం చెప్పలేదు. ఆమె సినిమా చేసి, అది విడుదలకు సిద్ధమైతే మీడియా ఇంటరాక్షన్‌లో ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus