Prabhas: భవిష్యత్తుతో పోరాడే స్టోరీతో..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా కావాల్సినంత క్రేజ్ అందుకున్న డార్లింగ్ తన మంచి మనసుతో మరికొన్నాళ్లకు ప్రపంచాన్ని ఆకర్షించేందుకు రెడీగా ఉంటాడు. అతని కటౌట్ కు ఎలాంటి బాక్సాఫీస్ అయినా ఫిదా అవ్వాల్సిందే. ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. ఆ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

హాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన మరొక గాసిప్ వైరల్ గా మారింది. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఫ్యూచర్ లో రాబోయే సమస్యలకు కనెక్ట్ అయ్యి ఉంటుందట. ఇక అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ టైమ్ మిషిన్ ప్రయోగంతో అతన్ని భవిష్యత్తుకు పంపిస్తారని టాక్ వస్తోంది. ఇది ఎంతవకు నిజమో చెప్పలేము గాని సినిమా కాన్సెప్ట్ మాత్రం ఎక్కువగా 2050వ సంవత్సరంతోనే ముడిపడి ఉంటుందట.

Crazy update on Prabhas Nag Ashwin movie1

ఆ సంవత్సరం చుట్టే కథను రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రీ ప్రొడక్షన్ కోసమే దాదాపు ఏడాది సమయాన్ని కేటాయిస్తున్న దర్శకుడు పక్కా ప్లాన్ సిద్దమైన తరువాతే షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. మరి సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus