పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా ఆ సినిమాలు పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పవన్ ఆస్తులకు సంబంధించి నాగబాబు షాకింగ్ విషయాలను వెల్లడించారు. పవన్ అప్పులకు సంబంధించి కూడా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ కు ఆస్తులతో పోల్చి చూస్తే అప్పులే ఎక్కువని భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కు అప్పులు ఉన్నాయంటే చాలామంది నమ్మరని నాగబాబు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ కొరకు ప్రజల కొరకు తన ఆదాయం నుంచి సహాయం చేస్తాడని నాగబాబు చెప్పుకొచ్చారు. జనసేన కోసం పవన్ కళ్యాణ్ ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేశారని నాగబాబు కామెంట్లు చేయడం గమనార్హం.
పవన్ ఆస్తులు ప్రస్తుతం తాకట్టులోనే ఉన్నాయని నాగబాబు అన్నారు.
పవన్ కు ఫామ్ హౌస్, 8 ఎకరాల పొలం మాత్రమే ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. ఆ పొలాన్ని పవన్ ఎంతో ఇష్టంతో కొన్నారని జానీ మూవీ ఫ్లాపైన సమయంలో పవన్ కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ ను డిస్ట్రిబ్యూటర్ కు వెనక్కిచ్చారని నాగబాబు పేర్కొన్నారు. ఎనిమిది ఎకరాల పొలం కూడా ఇచ్చేస్తానని పవన్ చెప్పగా నేనే ఆపానని నాగబాబు కామెంట్లు చేశారు. ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ కు లేదని పవన్ ఇల్లు కార్లు కూడా లోన్లలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు.
పవన్ ఆస్తులు, అప్పుల గురించి నాగబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కొన్ని విషయాలలో చాలా గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?